![]() |
తెలుగు పాత పాటలు |
1961 లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతిపాటా వీనులవిందే ! ప్రత్యేకించి శ్రీశ్రీ రాసిన పాడవేల రాధికా అన్న పాట అత్యంత మనోహరం . సుశీల మధురాతి మధురంగా గానం చేసిన ఈ పాటలో ఘంటసాల ముక్తాయింపుగా ఒకే ఒక్క పాదం పాడతాడు . అయితేనే అది ఎంతో రసరంజకం. ఏమైనా , హృదయాల్లో హోరెత్తిపోయే వాటిల్లో ఈ వీణ పాటను విశేషంగా చెప్పుకుంటారు .
పాడవేల రాధికా ... !
పాడవేల రాధికా ..ప్రణయ సుధాగీతికా//పాడవేల//
అంతో ఇంతో పాడగలిగే వారినే ఎవరైనా పాడమని అడుగుతారు . అంతేగానీ అసలే పాడలేని వారిని అయితే ఆ పాడగలిగే వారు కూడా పాడకపోతే , ఎందుకు పాడటం లేదు ? అనే ప్రశ్న ఎలాగూ వస్తుంది . కాకపోతే , పాడగలిగే వారంతా ఆడిగీ అడగగానే పాడగలుగుతారా ? అంటే అది సాధ్యం కాదు మరి ! అందుకు ఒక ఉల్లాసకరమైన మానసిక స్థితి అవసరం . కొన్నిసార్లు సహజసిద్ధంగానే పాడగలిగే మనోస్థితి ఉండదు . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా అది భావోద్వేగాల వెల్లువ ! ఆ రసస్థితి లేనప్పుడు గొంతు ఉండి కూడా లేనట్లే ! ఆ స్థితిలో ఏం చేయాలి ?
![]() |
padavela radhika Songs lyrics |
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ ... నీ వీణను సవరించి // పాడవేల //
తలపెట్టిన పనికి అన్నిసార్లూ మన లోంచే ఆ ప్రేరణ రాకపోవచ్చు . అలాంటప్పుడు విజ్ఞుల నుంచో రసజ్ఞుల నుంచే ప్రేరణ పొందాలి . గాత్రం వాద్య సహకారం పొందినట్లు , పరిసరాల నుంచో , పరిచయాల నుంచో , ప్రకృతి నుంచే ప్రేరణ పొందాలి . అడిగిన వారి మనసు నొప్పించకుండా అందంగా , ఆడిగిన వారు పరవశించేలా పాడాలి ! హృదయంలో మంటలు రేపే గ్రీష్మమే ఉండవచ్చు. కానీ , ప్రకృతి వసంతమయం అయినప్పుడు దాన్నించి స్ఫూర్తి పొందాల్సిందే ! భూమిని పచ్చదనంతో నింపే వసంతం , ఆకాశాన్ని కాంతివంతం చేసే వెన్నెల సృష్టి చైతన్యానికి ప్రతీకలే కదా ! వీటి నుంచి ఎంత శక్తినైనా పొందవచ్చు . ఈ భూమ్యాకాశాల ప్రేరణ , ఒక దశలో మనో వికారాలేవీ లేని ఒక భావాతీత స్థితికి చేరుస్తుంది . ఒక్కసారి ఆ స్థితిలోకి ప్రవేశిస్తే , గొంతులోంచి హృదయాన్నే కాదు , మొత్తంగా జీవితాన్నే పలకింపచేసే గానం పెల్లుబుకుతుంది .
![]() |
padavela radhika lyrics |
గోపాలుడు నిను వలచి - నీ పాటను మదితలచి ...
ఏ మూలనో పొంచి పొంచి .. వినుచున్నాడని ఎంచి // పాడవేల ||
పాడమని అడిగిన వాడు , మన వాడై , మనసులోని వాడైనప్పుడు మనసులో జీశ శక్తి నింపుకోవాల్సిందే ! గొంతులో సెలయేరులు ప్రవహింపచేయాల్సిందే ! పాడమంటూ వచ్చి ఎదురుగా నిలుచున్నవాడే కాదు , ఎదురుగా రాకుండానే ఎంతెంతో మంది నీ గాన ప్రియులు , నీ గొంతులోంచి ఏదైనా ఒక పాట తేనెల సోనగా జాలువారుతుందేమో నని చాటుగా పొంచి పొంచి వింటున్నారేమో ఎవరికి తెలుసు ? ఎలా చూసినా గొంతు సవరించుకోవలసిందే ! తనలోంచి తాను బయటికి వచ్చి చుట్టూ చేరిన హృదయాల్ని రసరంజితం చేయాల్సిందే
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము విని
![]() |
ANRvideosongs |
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ // పాడవేల //
ఏదో మామూలుగా వినేవాళ్లే కాదు , స్వతహాగా గొప్ప గానప్రియులైన వారు నీ చెంతచేరి , అప్పుడెప్పుడో పలికిన నీ హృదయవీణ మాధుర్యం కోసం ఎదురుచూస్తుంటే ఏమిటి చేయడం ? గుండెలోంచి రసఝరులు ఒంపాల్సిందే! నిజానికి , పాడటానికి రాగజ్ఞానం , స్వరశక్తి మాత్రమే సరిపోవు . అపారమైన ఆత్మవిశాసం ఉండాలి . దాన్ని సముపార్జించుకున్న వాడు ధన్యుడు . అతడు వ్యక్తిగతమైన ఎన్నెన్నో అవరోధాలను అవలీలగా అధిగమించగలడు . ఆ స్థితిలో నలుగురి కోసం తన హృదయాన్ని సవరించుకోగలడు . అనంతమైన శక్తితో గొంతెత్తి ఆత్మగానం చేయగలడు !!
![]() |
anroldsongs |
#anrvideosong,#padavela radhika lyrics, #anroldsongs
Nice song. Your elaborate discussion is very good.
రిప్లయితొలగించండివీణామృదు రవమే...... నిజమే
రిప్లయితొలగించండిఇంత మంచి పాటలు ఇప్పట్లో ఎక్కడివి
రిప్లయితొలగించండిVery beautiful thanks for
రిప్లయితొలగించండిYour depth clarification
Suswaram sumadharam
రిప్లయితొలగించండిమదూరాతి మధురాలు మన మదిలోని జ్ఞాపకాలూ అజరాతి మధురం శుమదూరం మంచి పాటలు
రిప్లయితొలగించండిఆనాటి మధురాతి మధురమైన పాటలు ఎంత విన్నా ఇంకా వినాలనిపించింది
రిప్లయితొలగించండి