పద్యమాధురి
పాటను పద్యంలా, పద్యాన్ని పాటలా పాడే ఒక విలక్షణత ఘంటసాలలో ఉంది. జంద్యాల పాపయ్య శాస్త్రి రచించిన ‘అద్వైతమూర్తి’ పద్యఖండికలోని ఒక పద్యాన్ని ఈ విలక్షణతతోనే పాడారు. ఘంటసాల తనే స్వరపరిచి పాడిన ఈ పద్యంలోని ‘‘ నీవే నేనుగ ....... నేనే నీవుగ’’ అన్న మాటలు వింటూ ఉంటే పాటలాగే అనిపిస్తుంది. మరోసారి విని ఆస్వాదిద్దాం మరి!
నీవే నేనుగ ... నేనే నీవుగ
భావోద్యనమునందు క్రొత్త వలపుం పందిళ్లలో కోరికల్
తీవల్ సాగెను., పూలు పూచెను., రసార్ర్థీభూత చేతమ్ముతో
‘‘ నీవే నేనుగ .... నేనే నీవుగ’’ లంతాంగీ! యేకమైపోద మీ ప్రావృణ్ణీరద పంక్తిక్రింద పులకింపన్ పూర్యపుణ్యావళుల్!
‘‘ నీవే నేనుగ .... నేనే నీవుగ’’ లంతాంగీ! యేకమైపోద మీ ప్రావృణ్ణీరద పంక్తిక్రింద పులకింపన్ పూర్యపుణ్యావళుల్!
(ఓ లతాంగీ! ఈ బావాల నందనాన, కొత్తకొత్తగా అల్లుకున్న వలపు పందిళ్లలో, మన కోరికలు తీగల్లా సాగి, పూలుపూచాయి. వర్షమేఘాలు కమ్ముకున్నాయి మన హృదయాలు ఆనందంలో తడిసిపోయాయి
రసార్థ్రమైపోయాయి. ఈ మేఘాల నీడన నీవే నేనుగా, నేనే నీవుగా మన ఇన్నేళ్ల పుణ్యాలు పులకించే విధాన ఒకటైపోదాం!.)
రసార్థ్రమైపోయాయి. ఈ మేఘాల నీడన నీవే నేనుగా, నేనే నీవుగా మన ఇన్నేళ్ల పుణ్యాలు పులకించే విధాన ఒకటైపోదాం!.)
స్నేహితుల మధ్య కావచ్చు. ప్రేమికుల మధ్య కావచ్చు. దంపతుల మధ్య కావచ్చు. ప్రాంతాల మధ్య..., దేశాల మధ్య కావచ్చు..... అనాదిగా తలెత్తుతున్న అనేకానేక ఘర్షణలకు కారణమేమిటి? మౌలికంగా మనిషికీ మనిషికీ మధ్య జరుగుతున్న ఆ ఘర్షణల మూలాలేమిటి? ‘‘నువ్వు వేరు, నేను వేరు’’ అన్న భావనే కదా ప్రధాన కారణం! నీ వర్గం వేరు ..... నా వర్గం వేరు.....నీ దారి వేరు, నా దారి వేరు అనుకోవడమే కదా!
నీ కష్టం ... నా కష్టం కాదు, నీ బాధ .... నా బాధ కాదు. నీ మేలు ... నా మేలు కాదు. నీ ప్రగతి .... నా ప్రగతి కాదు అనుకోవడమే కదా! అయితే అంతటితో ఆగిపోయినా బావుండేది. నీ నష్టమే నా లాభం, నీ బాధే నా ఆనందం, నీ పతనమే నా ప్రగతి, నీ నాశనమే నా వికాసం అనేదాకా వెళ్లాడు మనిషి! నువ్వూ నేనూ ఒకటే అన్న అద్వైత భావన కొరవడటమే కదా ఇందుకు కారణం! ఇలాంటి ఈ దూరాలూ, వ్యత్యాసాలూ లేకుండా ఎవరైనా ‘నీవే నేను... నేనే నీవు’ అన్న భావనతో ఉండిపోగలిగితే ఎంత బావుంటుంది? కానీ, అలా ఉండదే! కాకపోతే..., ఈ అద్వైత భావన ప్రేమికుల మధ్యే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని ఈ భావన జీవితమంతా వారిలో ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఉన్నా కొందరిలోనే....చాలా అరుదుగానే! అలా కాకుండా సమస్త మానవాళిలో సర్వకాల, సర్వావస్థల్లోనూ ఈ భావన పరిఢవిల్లగలిగితే ప్రపంచానికి అంతకన్నా ఏం కావాలి!!
- బమ్మెర
సర్! నమస్కారము. మీ విశ్లేషణ చాలా బాగుంది. మీరన్నట్లు అందరూ ఒకటే అనుకుంటే అసూయ వుండదు కదా!అసూయ లేకపోతే ప్రపంచం అందంగా వుంటుంది కదా! ప్రజలు ఆనందంగా వుంటారు కదా! అందరూ ఒకటే అన్న భావన అందరిలో కలగాలని ఆశిద్దాం. డి.జి.యస్. శ్రీనివాస్
రిప్లయితొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండిChala bagundi sir Nattanashal padyalu pettandi sir🙏
రిప్లయితొలగించండిBe Happy till 100/99
రిప్లయితొలగించండిNice
రిప్లయితొలగించండిVery nice sir 🙏🙏
రిప్లయితొలగించండి🙏🙏
రిప్లయితొలగించండిమంచి పద్యము. చక్కటి విశ్లేషణ. ధన్యవాదములు సార్. 🌹🙏🌹
రిప్లయితొలగించండి