తెలుగు ఓల్డ్ సాంగ్స్
గీతాంజలి
తెలుగు సినీ గీతాభిమానులకు ఇది షడ్రసోపేతమైన విందు. పాత పాటలంటే అవి ఆపాత మధురాలు కదా !
అవి రాగ , భావ , తాళాల త్రివేణి సంగమాలు. ఈ సంగమ క్షేత్రంలోకి ఇదే మా స్వాగతం !! ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ పాటలు మొదలవుతాయి అంటూ ఉంటారు . ఎందుకంటే మనసులోని లోతైన భావాల్ని చెప్పలేక, మాటలు ఎన్నోసార్లు నిస్సహాయంగా నిలబడతాయి . కొండంత అశక్తతతో వాటి గొంతు మూగబోతుంది .
సరిగ్గా అదే సమయంలో…. మేమున్నాం అంటూ పాటలు తమ గొంతు విప్పుతాయి .ఎందుకంటే , మాటలతో పోలిస్తే , పాటలది ఎప్పుడూ పైచేయే !లోతైన భావాల్ని చెప్పడానికి సాదాసీదా మాటల్నే కాదు రాగ , తాళాల్నే కాదు, కవిత్వాన్నీ , తాత్వికతను కూడా తనలో కలిపేసుకుని, తన విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే పాట వినగానే గుండె బరువంతా దిగిపోయినట్లు మనసు కొండంత ఊరట పొందుతుంది. అందుకే పాట మనసుకు ప్రాణ సమానమైపోయింది. అలాంటి ప్రాణ సమానమైన, కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … వారం వారం మీ ముందు ఉంచుతుంది. పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది.
పద్యాలు సైతం ……
ఈ వేదికలో పాలుపంచుకునే అందమైన మరో అంశం కూడా ఉంటుంది. అది తెలుగు భాషలో తప్ప మరే భాషలోనూ లేనే లేని, ఒక విలక్షణమైన కావ్యప్రక్రియ … అదీ పద్యం. అత్యంత మధురమైన లలితమైన ఎన్నెన్నో పద్యాల్ని, ఈ వేదిక అప్పుడప్పుడు మీకు వినిపిస్తుంది .ఆస్వాదించండి … ఆనందించండి .
ఇదే సమయంలో ఈ లక్ష్య సాధనలో
మరింత బలంగా , నిత్యనూతనంగా సాగిపోయేందుకు అవసరమైన ఒక మహాశక్తి మాకు కలిగేలామమ్మల్ని మనసారా ఆశీర్వదించండి .
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు ఓల్డ్ సాంగ్స్
I heart-felt appreations to your analysis. I always read your articles on hindi and telugu songs.they are very good and ilike them very much. Please write your analysis on hindi song Kasti ka khamoshSafford Hai from girlfriend
రిప్లయితొలగించండిThanking you so much.we,the technical team informed your song to our author,bammera garu.Hope that we soonly publish your requested song analysis
రిప్లయితొలగించండి