పాటలో ఏముంది?
చిత్రం: బ్రతుకు తెరువు, గీతం: జూనియర్ సముద్రాల, సంగీతం: సుబ్బరామన్ - ఘంటసాల, గానం: ఘంటసాల
అందమె ఆనందం....!
అందం... ఆనందం ... ఇవి మనందరం రోజూ వినే మాటలే!
ఒద్దికైన రూపురేఖలే కావచ్చు. మనసుపడే మనోహరత్వం కావచ్చు. ఆక ర్షించేదీ, ఆహ్లాదపరిచేదీ, పారవశ్యంలో ఓలలాడించేదే కావచ్చు. మొత్తంగా అందమంటే ఇవే కదా మన దృిష్టిలో...! జ్ఞానుల దృష్టిలో మాత్రం వీటి అర్థాలు పూర్తిగా వేరు. ’ఇప్పటికి నిగనిగలాడుతున్నట్లే అనిపించినా మరి కాసేపట్లోనే వడలి, వాడిపోయేది అదేమంత గొప్ప అందం? ఎప్పటికీ చెక్కుచెదరకుండా, దినదిన ప్రవర్థమానమయ్యేదే అసలు సిసలైన అందం’ అంటారు వారు. ఈ రోజు ఎంత అపూరూపంగా అనిపించినా, ’ఏరోజుకారోజు క్షీణిస్తూపోయే భౌతిక సౌందర్యాల వల్ల ఒరిగేదేముంది? అవి ఎంతోకాలం నిలబడలేవు. దేన్నీ నిలబెట్టలేవు’ అని కూడా అంటారు. అయితే, దినదిన ప్రవర్థమానమయ్యే ఆ లక్షణం లోకంలో సత్య జ్ఞానానికీ, సౌందర్య జ్ఞానానికే తప్ప మరిదేనికీ ఉండదని కూడా వారు నొక్కి చెబుతారు. నిజానికి, సత్య జ్ఞానమూ, సౌందర్య జ్ఞానమూ ఈ రెండూ ఒకటే. ఒకవేళ ఏ కారణంగానో ఈ రెండింటినీ వేరువేరే అనుకున్నా, ఈ రెండింటి మూలతత్వం మాత్రం చైతన్యమే! ఈ క్రమంలోనే ’ సత్యం - శివం - సుందరం’ అంటూ ఒక మహా వ్యాఖ్య చేస్తారు. సర్వ సమగ్రమైన చైతన్యమే సౌందర్యం అనేది ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. అంటే ఏమిటి? దేన్నించి అయితే ఏదీ పక్కకు వెళ్లదో, , ఏదైతే సర్వకాల, సర్వావస్థల్లోనూ సచేతనంగా నిలిచి ఉంటుందో అదే సుందరమనేది వారి భావన.
ఏమైనా, ’అందమె ...ఆనందం’ ఆంటూ. అలతిపొలతి మాటలతో మొదలై ....అనంతమైన ఆధ్యాత్మిక దిశగా నడిపించే ఈ పాట సినీగీత సాహిత్యంలో ఒక కలికితురాయి. 1953 లో విడుదలైన ’బ్రతుకు తెరువు’ సినిమా కోసం జూనియర్ సముద్రాల రాసిన ఈ పాటకు.. సి.ఆర్. సుబ్బరామన్ - ఘంటసాల సంయుక్త సంగీత సారధ్యంలో ఆపాత మధురమైన బాణీయే సమకూరింది. ఈ పాటను పాడటంలో ఘంటసాల గొంతులో నిజంగా అమృత ధారలే ఒలికాయి. అందుకే ఈ పాట ఆవిర్భవించి. ఇప్పటికి ఏడు దశాబ్దాలు కావస్తున్నా తెలుగు వారి గుండెల పైన అది ఇప్పటికీ తేనె జల్లు కురిపిస్తూనే ఉంది. నిజానికి, దశాబ్దాలు, శతాబ్దాలే కాదు, ఎప్పటికీ ... ఎప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే... భూమ్మీద తెలుగు హృదయాలు ఉన్నంత కాలం, ఈ పాట రసఝరులు ఒలికిస్తూనే ఉంటుంది.
అందమె ఆనందం .....
ఆనందమె జీవితమకరందం // అందమె //నిజానికి, ’సౌందర్యమే సత్యం... సత్యమే సౌందర్యం’ అన్న వేదాంత వ్యాఖ్యానమే ఈ పాటలోని ’అందమె ఆనందం’ అన్న పాదానికి ప్రాణమయ్యింది. ఉన్నదంతా సత్యమే.. లేనిదే అసత్యం. ఉండడం అంటే ఈ రోజు ఉండి, రేపటికి కనుమరుగైపోవడం అని కాదు. అనాదిగా, ఆద్యంతంగా, అజరామరంగా నిలిచి వెలగడం. అందం అనే కాదు. అనందం కూడా అలాంటిదే! ’ఆనందం’ అన్నది అనంతం అన్న మాటలోంచే కదా ఆవిర్భవించింది. ఏది క్షణికం కాదో, ఏది శాశ్వతమో, ఏది అనంతమో అదే ఆనందాన్నిస్తుందనే కదా ఈ మాటకు అర్థం? లోకంలోని సర్వ వస్తు సముదాయం, భౌతికమైన సమస్త వసతులు, సకల సౌకర్యాలూ, ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ ఇస్తూ, మనిషికి తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలనైతే ఇవ్వగలవు. అంతే గానీ, వీటిల్లో ఏ ఒక్కటీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషికి అసలు సిసలైన ఆనందాన్ని ఇవ్వగలిగే ది అభౌతికమైన, శాశ్వతమైన, అనంతత్వ జ్ఞానమొక్కటే! ఒకటి మాత్రం నిజం! సత్యానికైనా, సౌందర్యానికైనా అంతిమ లక్ష్యం ఆనందమే! అందుకే ఆనంద పిపాసులు ఎటెటో తిరిగి తిరిగి చివరికి అనంతత్వాన్ని ప్రభోదించే ఆధ్యాత్మిక విషయాల్లోకే ప్రవేశిస్తారు. జీవిత మకరందమైన ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు.
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం // అందమె //నిజమే! రూప సౌందర్యాలూ, ప్రకృతి సౌందర్యాలూ క్షణికమైనవే, తాత్కాలికమైనవే, కాకపోతే మనిషి వాటినుంచి కూడా స్పూర్తి పొందవచ్చు. తన మనసును కూడా పడమట సంధ్యారాగమంత సుశోభితం చేసుకోవచ్చు. పూలపరాగాల్లో హృదయాన్ని పరిమళ భరితం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం విశ్వమంతా సమస్త ప్రాణికోటిలో చైతన్యం నింపే స్పూర్తికుండమే కదా! ఆ వరుసలో చూస్తే, చంద్రుడు నీ మనసును తనలా ఎప్పుడూ చల్లచల్లగా, వెన్నెల కురిపిస్తూ ఉండేలా చూసుకొమ్మంటాడు. సూర్యుడేమో అన్నివేళలా అలా ఉంటే కుదరదు నాయనా! జీవితం అన్నాక అప్పుడప్పుడైనా నాలా భగభగా మండడం కూడా అవసరమే అంటాడు. నదులూ, సముద్రాలేమో, జడ త్వాన్ని ఽఎప్పుడూ దరి చేరనీయకుండా ఒక ప్రవాహంలా ఉండాలంటూ తమవైన పాఠాలు చెబుతాయి. అదే సమయంలో అందుకు భిన్నంగా నిరంతరం తరంగాల్లా ప్రతిదానికీ తల్లడిల్లిపోతే ఎలా? నిశ్చలంగా, నిబ్బరంగా తమలా నిలిచి ఉండాలంటూ, పర్వతాలు తమ అస్థిత్వాన్ని చాటి చెబుతాయి. మోహన రాగాలనేవి చెలిచెంత నుంచే కాదు పురుషోత్తమా! ముగ్దమనోహరమైన నీ అంతరంగమే అనంతకోటి మోహన రాగాలు వినిసిస్తుంది ఒకసారి విని చూడు! అంటూ గాలి ఈలలు వే స్తూ, నీ భుజాలు కుదుపుతుంది. అవునూ.... చెంతనే ఇన్నిన్ని రసస్పూర్తులు అందుతుంటే, ఎవరికైనా, లోకం మహత్తరంగా, జీవితం మధురాగనురాగంగా అనిపించక ఏంచేస్తుంది?
పడిలేచే కడ లితరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో..... సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం // అందమె //నిలువెల్లా చైతన్య దీప్తులు నింపుకున్న జీవితం ఎక్కడా రాజీ పడదనేది నిలువెత్తు నిజం! తరంగంలా అది ఎన్నిసార్లు పడిపోతే, అన్ని సార్లూ మళ్లీ లేచే ప్రయత్నమే చేస్తుంది.. ఏ పక్షి అయినా అనుకోని వాన వడిలో తడుస్తూ, ముందు కొంత భయభ్రాంతికి గురైతే కావచ్చు కానీ, ఆ వెంటనే, జవసత్వాలు నింపుకుని తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు పతంగం, మేఘాలను తాకితే అందులో అంత గొప్పేముంది? అందుకు భిన్నమైన సుడిగాలిలో కూడా పతంగం ఉవ్వెత్తున ఎగురుతుంది. అన్నింటికీ ఎదురీదుతుంది. కాకపోతే ఈ పోరాటాలన్నీ మన మేమిటో మనకు పూర్తిగా అవగతమైనప్పుడే చెయ్యగలం! పంచభూతాత్మకమైన మొత్తం ప్రపంచం సూక్ష్మరూపంలో మనలో వసిస్తున్నదన్న అసలు సత్యం బోధపడినప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం కాగలం! కాకపోతే, ఉన్నట్లుండి, ఏదో ఒక రోజున ఒక నైరాశ్యం, ఒక వైరాగ్యం మనసును ఆవహించవచ్చు. ఎందుకంటే, ఇంతా చేసి చివరికి మిగిలేదేమిటి? ఏదో ఒక రోజున అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి లోకం నుంచి నిష్క్రమించాల్సిందే కదా అనిపించవచ్చు. ఆ స్థితిలో రంగస్థలం మీది నుంచి బయటికి వె ళ్లిపోతున్న నటీనటుల్లాగే మనకు మనం కనిపించవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం జీవితమే ఒక నాటకంలా కూడా అనిపించవచ్చు. అవునూ! ఒకవేళ నాటకమే అయితే మాత్రం ఏమిటి? ప్రదర్శనకు సిద్ధమైనప్పుడు వేదికపై ఉన్నంత సేపు మన భూమికను మనం అద్భుతంగా పోషించగలిగితే చాలదా? జీవన వేదికా, నటనా వేదికా అన్నది ఇక్కడ విషయమే కాదు. నీ పాత్రకు నువ్వు పూర్తి స్థాయిలో న్యాయం చేశావా లేదా అన్నదొక్కటే అత్యంత కీలకమవుతుంది. ఆ నిర్శహణా పటిమే హృదయంలో మొక్కవోని అందాన్నీ, నిండైన ఆనందాన్నీ నింపుతుంది. అన్నింటినీ మించి జీవితానికి ఒక పరిపూర్ణమైన సార్థకతనిస్తుంది. ఏ మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలి!!
- బమ్మెర
అందం... ఆనందం ... ఇవి మనందరం రోజూ వినే మాటలే!
ఒద్దికైన రూపురేఖలే కావచ్చు. మనసుపడే మనోహరత్వం కావచ్చు. ఆక ర్షించేదీ, ఆహ్లాదపరిచేదీ, పారవశ్యంలో ఓలలాడించేదే కావచ్చు. మొత్తంగా అందమంటే ఇవే కదా మన దృిష్టిలో...! జ్ఞానుల దృష్టిలో మాత్రం వీటి అర్థాలు పూర్తిగా వేరు. ’ఇప్పటికి నిగనిగలాడుతున్నట్లే అనిపించినా మరి కాసేపట్లోనే వడలి, వాడిపోయేది అదేమంత గొప్ప అందం? ఎప్పటికీ చెక్కుచెదరకుండా, దినదిన ప్రవర్థమానమయ్యేదే అసలు సిసలైన అందం’ అంటారు వారు. ఈ రోజు ఎంత అపూరూపంగా అనిపించినా, ’ఏరోజుకారోజు క్షీణిస్తూపోయే భౌతిక సౌందర్యాల వల్ల ఒరిగేదేముంది? అవి ఎంతోకాలం నిలబడలేవు. దేన్నీ నిలబెట్టలేవు’ అని కూడా అంటారు. అయితే, దినదిన ప్రవర్థమానమయ్యే ఆ లక్షణం లోకంలో సత్య జ్ఞానానికీ, సౌందర్య జ్ఞానానికే తప్ప మరిదేనికీ ఉండదని కూడా వారు నొక్కి చెబుతారు. నిజానికి, సత్య జ్ఞానమూ, సౌందర్య జ్ఞానమూ ఈ రెండూ ఒకటే. ఒకవేళ ఏ కారణంగానో ఈ రెండింటినీ వేరువేరే అనుకున్నా, ఈ రెండింటి మూలతత్వం మాత్రం చైతన్యమే! ఈ క్రమంలోనే ’ సత్యం - శివం - సుందరం’ అంటూ ఒక మహా వ్యాఖ్య చేస్తారు. సర్వ సమగ్రమైన చైతన్యమే సౌందర్యం అనేది ఈ వ్యాఖ్యలోని అంతరార్థం. అంటే ఏమిటి? దేన్నించి అయితే ఏదీ పక్కకు వెళ్లదో, , ఏదైతే సర్వకాల, సర్వావస్థల్లోనూ సచేతనంగా నిలిచి ఉంటుందో అదే సుందరమనేది వారి భావన.
ఏమైనా, ’అందమె ...ఆనందం’ ఆంటూ. అలతిపొలతి మాటలతో మొదలై ....అనంతమైన ఆధ్యాత్మిక దిశగా నడిపించే ఈ పాట సినీగీత సాహిత్యంలో ఒక కలికితురాయి. 1953 లో విడుదలైన ’బ్రతుకు తెరువు’ సినిమా కోసం జూనియర్ సముద్రాల రాసిన ఈ పాటకు.. సి.ఆర్. సుబ్బరామన్ - ఘంటసాల సంయుక్త సంగీత సారధ్యంలో ఆపాత మధురమైన బాణీయే సమకూరింది. ఈ పాటను పాడటంలో ఘంటసాల గొంతులో నిజంగా అమృత ధారలే ఒలికాయి. అందుకే ఈ పాట ఆవిర్భవించి. ఇప్పటికి ఏడు దశాబ్దాలు కావస్తున్నా తెలుగు వారి గుండెల పైన అది ఇప్పటికీ తేనె జల్లు కురిపిస్తూనే ఉంది. నిజానికి, దశాబ్దాలు, శతాబ్దాలే కాదు, ఎప్పటికీ ... ఎప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే... భూమ్మీద తెలుగు హృదయాలు ఉన్నంత కాలం, ఈ పాట రసఝరులు ఒలికిస్తూనే ఉంటుంది.
ఆనందమె జీవితమకరందం // అందమె //
నిజానికి, ’సౌందర్యమే సత్యం... సత్యమే సౌందర్యం’ అన్న వేదాంత వ్యాఖ్యానమే ఈ పాటలోని ’అందమె ఆనందం’ అన్న పాదానికి ప్రాణమయ్యింది. ఉన్నదంతా సత్యమే.. లేనిదే అసత్యం. ఉండడం అంటే ఈ రోజు ఉండి, రేపటికి కనుమరుగైపోవడం అని కాదు. అనాదిగా, ఆద్యంతంగా, అజరామరంగా నిలిచి వెలగడం. అందం అనే కాదు. అనందం కూడా అలాంటిదే! ’ఆనందం’ అన్నది అనంతం అన్న మాటలోంచే కదా ఆవిర్భవించింది. ఏది క్షణికం కాదో, ఏది శాశ్వతమో, ఏది అనంతమో అదే ఆనందాన్నిస్తుందనే కదా ఈ మాటకు అర్థం? లోకంలోని సర్వ వస్తు సముదాయం, భౌతికమైన సమస్త వసతులు, సకల సౌకర్యాలూ, ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ ఇస్తూ, మనిషికి తాత్కాలికమైన సుఖ సౌఖ్యాలనైతే ఇవ్వగలవు. అంతే గానీ, వీటిల్లో ఏ ఒక్కటీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. మనిషికి అసలు సిసలైన ఆనందాన్ని ఇవ్వగలిగే ది అభౌతికమైన, శాశ్వతమైన, అనంతత్వ జ్ఞానమొక్కటే! ఒకటి మాత్రం నిజం! సత్యానికైనా, సౌందర్యానికైనా అంతిమ లక్ష్యం ఆనందమే! అందుకే ఆనంద పిపాసులు ఎటెటో తిరిగి తిరిగి చివరికి అనంతత్వాన్ని ప్రభోదించే ఆధ్యాత్మిక విషయాల్లోకే ప్రవేశిస్తారు. జీవిత మకరందమైన ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు.
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం // అందమె //
నిజమే! రూప సౌందర్యాలూ, ప్రకృతి సౌందర్యాలూ క్షణికమైనవే, తాత్కాలికమైనవే, కాకపోతే మనిషి వాటినుంచి కూడా స్పూర్తి పొందవచ్చు. తన మనసును కూడా పడమట సంధ్యారాగమంత సుశోభితం చేసుకోవచ్చు. పూలపరాగాల్లో హృదయాన్ని పరిమళ భరితం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం విశ్వమంతా సమస్త ప్రాణికోటిలో చైతన్యం నింపే స్పూర్తికుండమే కదా! ఆ వరుసలో చూస్తే, చంద్రుడు నీ మనసును తనలా ఎప్పుడూ చల్లచల్లగా, వెన్నెల కురిపిస్తూ ఉండేలా చూసుకొమ్మంటాడు. సూర్యుడేమో అన్నివేళలా అలా ఉంటే కుదరదు నాయనా! జీవితం అన్నాక అప్పుడప్పుడైనా నాలా భగభగా మండడం కూడా అవసరమే అంటాడు. నదులూ, సముద్రాలేమో, జడ త్వాన్ని ఽఎప్పుడూ దరి చేరనీయకుండా ఒక ప్రవాహంలా ఉండాలంటూ తమవైన పాఠాలు చెబుతాయి. అదే సమయంలో అందుకు భిన్నంగా నిరంతరం తరంగాల్లా ప్రతిదానికీ తల్లడిల్లిపోతే ఎలా? నిశ్చలంగా, నిబ్బరంగా తమలా నిలిచి ఉండాలంటూ, పర్వతాలు తమ అస్థిత్వాన్ని చాటి చెబుతాయి. మోహన రాగాలనేవి చెలిచెంత నుంచే కాదు పురుషోత్తమా! ముగ్దమనోహరమైన నీ అంతరంగమే అనంతకోటి మోహన రాగాలు వినిసిస్తుంది ఒకసారి విని చూడు! అంటూ గాలి ఈలలు వే స్తూ, నీ భుజాలు కుదుపుతుంది. అవునూ.... చెంతనే ఇన్నిన్ని రసస్పూర్తులు అందుతుంటే, ఎవరికైనా, లోకం మహత్తరంగా, జీవితం మధురాగనురాగంగా అనిపించక ఏంచేస్తుంది?
వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో..... సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం // అందమె //
నిలువెల్లా చైతన్య దీప్తులు నింపుకున్న జీవితం ఎక్కడా రాజీ పడదనేది నిలువెత్తు నిజం! తరంగంలా అది ఎన్నిసార్లు పడిపోతే, అన్ని సార్లూ మళ్లీ లేచే ప్రయత్నమే చేస్తుంది.. ఏ పక్షి అయినా అనుకోని వాన వడిలో తడుస్తూ, ముందు కొంత భయభ్రాంతికి గురైతే కావచ్చు కానీ, ఆ వెంటనే, జవసత్వాలు నింపుకుని తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు పతంగం, మేఘాలను తాకితే అందులో అంత గొప్పేముంది? అందుకు భిన్నమైన సుడిగాలిలో కూడా పతంగం ఉవ్వెత్తున ఎగురుతుంది. అన్నింటికీ ఎదురీదుతుంది. కాకపోతే ఈ పోరాటాలన్నీ మన మేమిటో మనకు పూర్తిగా అవగతమైనప్పుడే చెయ్యగలం! పంచభూతాత్మకమైన మొత్తం ప్రపంచం సూక్ష్మరూపంలో మనలో వసిస్తున్నదన్న అసలు సత్యం బోధపడినప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం కాగలం! కాకపోతే, ఉన్నట్లుండి, ఏదో ఒక రోజున ఒక నైరాశ్యం, ఒక వైరాగ్యం మనసును ఆవహించవచ్చు. ఎందుకంటే, ఇంతా చేసి చివరికి మిగిలేదేమిటి? ఏదో ఒక రోజున అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి లోకం నుంచి నిష్క్రమించాల్సిందే కదా అనిపించవచ్చు. ఆ స్థితిలో రంగస్థలం మీది నుంచి బయటికి వె ళ్లిపోతున్న నటీనటుల్లాగే మనకు మనం కనిపించవచ్చు. ఆ మాటకొస్తే మొత్తం జీవితమే ఒక నాటకంలా కూడా అనిపించవచ్చు. అవునూ! ఒకవేళ నాటకమే అయితే మాత్రం ఏమిటి? ప్రదర్శనకు సిద్ధమైనప్పుడు వేదికపై ఉన్నంత సేపు మన భూమికను మనం అద్భుతంగా పోషించగలిగితే చాలదా? జీవన వేదికా, నటనా వేదికా అన్నది ఇక్కడ విషయమే కాదు. నీ పాత్రకు నువ్వు పూర్తి స్థాయిలో న్యాయం చేశావా లేదా అన్నదొక్కటే అత్యంత కీలకమవుతుంది. ఆ నిర్శహణా పటిమే హృదయంలో మొక్కవోని అందాన్నీ, నిండైన ఆనందాన్నీ నింపుతుంది. అన్నింటినీ మించి జీవితానికి ఒక పరిపూర్ణమైన సార్థకతనిస్తుంది. ఏ మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలి!!
- బమ్మెర
Super song valyubul message
రిప్లయితొలగించండిPatha patalu gurthu chesi manasuku hai kalpincharu
రిప్లయితొలగించండిమధురమైన పాట. నిజంగానే ఆపాత మధురం. తెలుగు పాటల్లో కలికితురాయి. మంచి విశ్లేషణ కూడా!🌹🙏🌹అభినందనలు సార్.
రిప్లయితొలగించండిExcellent service good
రిప్లయితొలగించండిExcellent songs
రిప్లయితొలగించండిబాగా లేదు
రిప్లయితొలగించండిMemorable song 🎉
రిప్లయితొలగించండి