పాటలో ఏముంది ?
ఘంటసాల పాడిన వాటిల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అరుదైన పాట ఇది . 1955 లో విడుదలైన సంతానం సినిమా కోసం అనిసెట్టి రాసిన ఈ పాటను స్వరపరచిన వారు సుసర్ల దక్షిణామూర్తి . పాటకు ముందు ఉండే ఆలాపన హృదయాల్ని ఏ దూరతీరాలకో తీసుకువెళ్లి వదిలేస్తుంది . పల్లవి మొదలైనప్పుడు గానీ మళ్లీ వెనక్కి వచ్చి ఉన్నచోట వాలిపోలేము ! ఒకసారి వినిచూడండి , మీకే తెలుస్తుంది .
చల్లని వెన్నెలలో
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే - ఆనందమె నా గానమాయెనే // చల్లని //
సర్వసమగ్రమైన సత్యమే సుందరము అంటూ ఉంటారు . సత్యం - శివం - సుందరం అనే మాట అక్కడి నుంచి వచ్చిందే కదా ! అలాంటి మహోన్నతమైన సౌందర్యం , లేదా అందం మనలో లీనమైపోతే జీవితానికి అంతకన్నా ఏం కావాలి ? కాకపోతే ఆ అందం మనలో లీనం కావడానికి ఏదో ఒక మూలం , ఏదో ఒక స్పూర్తి అవసరం ఒక కారణభూతం అవసరం . అది ఏ శిల్పకళా వైభవమో కావచ్చు .ఏ రాగ ప్రవాహమో కావచ్చు . లేదా ఒక సజీవ శిల్పసుందరి అంటే ఒక చక్కని కన్నె రూపమే కారణం కావచ్చు. కన్నె అంటే ఇక్కడ అదేదో శరీర సౌష్టవం , మిసిమితనం అనికాదు . సర్వసమగ్రమైన సజీవ రూపమే ఆ కన్నెతనం . అలాంటి రూపమే అతని ముందు కదలాడింది . ఒక దివ్యమైన ఆనందం అతనిలో కావ్యమయ్యింది . అదే అతని అధ్బుత గానమయ్యింది .
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి - తేలియాడెనే ముద్దులలో
Challani Vennalalo Chakkani Kanne Song |
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి - తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన - పూలు నవ్వెనే నిద్దురలో // చల్లని //
ప్రణయ లోకంలో , ప్రేమకలాపాల్లో తేలాడేది ఒక్క మనుషులేనా ? సమస్త ప్రాణికోటి అనే కాదు , చరాచర జగత్తంతా ఆ మధురానుభూతిలో ఓలలాడుతూ ఉంటుంది. అయితే , ఇవన్నీ మానవహృదయాలకు ఒక ప్రేరణలే ! స్పూర్తి కారకాలే చంద్రుణ్నే చూడండి మేఘాల కౌగిలిలో మైమరిచిపోతుంటాడు . మృదుమధురంగా తాకే గాలి స్పర్శకు నిద్రలో జోగుతున్నా సరే పూలు మురిసిపోతాయి . ముసిముసిగా నవ్వుకుంటాయి . జీవితం తాలూకు ఎన్ని ఘర్షణల్లో ఉన్నాసరే మనిషి ఆ రసరమ్య భావాల్లో తేలిపోతుంటాడు .
కలకాలం నీ కమ్మని రూపము కలవరింతునే నా మదిలో // చల్లని //
ప్రేమమయమైన ప్రకృతి తాలూకు ప్రేరణలతో ప్రభావితం కావడమే కాదు. పారవశ్యంలో ఉన్న మనసుకు తన ప్రేమ మూర్తి ముఖబింబం దశదిశలా కనిపిస్తుంది . నేల మీదే కాదు ఆకాశంలోనూ కనిపిస్తుంది . ఆకాశమంతా విస్తరించిన నక్షత్రాల గుంపులో కదలాడుతూ కనిపిస్తుంది . అలా లోకమంతా కనిపించే ఆమె కమ్మని రూపాన్ని జీవిత కాలమంతా తలుచుకుంటూనే ఉంటాడు . అనుక్షణం కలవరిస్తూనే ఉంటాడు . అతని కలవరింతలకూ , పారవశ్యాలకూ ప్రతిరూపమే ఈ పాట . మనసారా ఆస్వాదించండి మరి !!
''మహోన్నతమైన సౌందర్యం , లేదా అందం మనలో లీనమైపోతే జీవితానికి అంతకన్నా ఏం కావాలి ? కాకపోతే ఆ అందం మనలో లీనం కావడానికి ఏదో ఒక మూలం , ఏదో ఒక స్పూర్తి అవసరం ఒక కారణభూతం అవసరం.''
---బమ్మెర
నీ చరణ కమలాల నీడయే చాలు పాట లిరిక్స్ విశ్లేషణ
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు
7989892507
https://wa.me/message/6YRYVO6BHLZMA1
Akkineni Nageswara cinema, Akkineni Nageswara Rao, ANR Old Telugu Movies, Akkineni nageswara rao Telugu cinema,Old Songs,ANR Old Songs ,Challani Vennalalo Chakkani Kanne Song ,Santaanam Film,
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు
7989892507
https://wa.me/message/6YRYVO6BHLZMA1
Akkineni Nageswara cinema, Akkineni Nageswara Rao, ANR Old Telugu Movies, Akkineni nageswara rao Telugu cinema,Old Songs,ANR Old Songs ,Challani Vennalalo Chakkani Kanne Song ,Santaanam Film,
Hats off you anjanna
రిప్లయితొలగించండిThanks for your response💐
తొలగించండిస్త్రీ మూర్తిని ప్రేమించిన మనసు ప్రకృతి ని ప్రేమిస్తుంది. (పురుషునికీ అదేవర్తిస్తుంది స్త్రీ వైపు నుండి) స్త్రీ పురుషులకు ఇరువురురికీ ఒకరికొకరి మీద అనురాగం --> తమ తమ మనో ప్రపంచంలో ఆనందం విశ్వ వ్యాపితం కావటం బహుశా పరాకాష్ట అనుకుంటా. బమ్మెర వారు చక్కగా తమ సహజ శైలిలో అక్షరీకరించారు. కృతజ్ఞతలతో
రిప్లయితొలగించండివెనకటి పాటలొ చాలా అర్థాలు ఉంటాయండి అది మీరు ఇంత మంచిగా విశ్లేషణ చేయడం చాలా బాగా ఉంది
రిప్లయితొలగించండిసంతోషం కలిగించే పోగ్రం . మీది . నా ఫోన్ లో పాత పాటలు పంపుతారా అయితే నా వాట్సప్ నెంబర్ ఇది .9553498909
రిప్లయితొలగించండిNice song
రిప్లయితొలగించండిNice song old is gold
రిప్లయితొలగించండిహృత్పూర్వక నమస్సులు.
రిప్లయితొలగించండి