పాటలో ఏముంది ?
శ్రీకృష్ణావతారం సినిమాలోని ముగ్ధమనోహరమైన ఈ పాట డాక్టర్ సి. నారాయణ రెడ్డి కలంలోంచి జాలువారినది.1967 లో విడుదలైన ఈ సినిమాకు టి.వి. రాజు సంగీత దర్శకత్వం వహించారు .త్రివేణి సంగమంలా ఘంటసాల , లీల , సుశీలల గాత్రాలు ఈ పాటను ఎంతో మృదుమధురంగా గానం చేశారు . ఈ ప్రణయగీతం , పౌరాణిక సినిమాల్లోకెల్లా మకుటాయమానంగా నిలిచింది అనేది వాస్తవం.ఎప్పటిదో 50 ఏళ్ల క్రితం నాటి ఈ సృజన , ఇప్పటికీ రసుజ్ఞులకు వీణుల విందు చేస్తోంది అంటే , ఈ పాట ఎంత రసాత్మకమో ఊహించుకోవచ్చు .
నీ చరణ కమలాల నీడయే చాలు !
జీవితంలో ఇప్పటిదాకా తనకేమీ లభించనేలేదు .ఏవైనా లభ్యమైనా అవి ఎందుకూ కొరగానివని కొందరు అనుకుంటారు . మరికొందరేమో , ఇప్పుడున్నవే చాలా ఎక్కువ . ఇవి లభించడం నిజంగా ఎంతో గొప్ప అదృష్టం అనుకుంటారు . రెండవ కోవకు చెందిన వారు నిరంతరం ఆనంద డోలికల్లో తేలాడుతుంటే , మొదటి కోవకు చెందిన
వారేమో జీవితమంతా ఏడుస్తూ గడిపేస్తారు . రుషులు , మహర్షులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ , ఉన్నదాని పై నిర్లక్ష్యం , లేనిదానిపై వ్యామోహం ... ఇవే దుఃఖానికి అసలు మూలమని చెబుతుంటారు . అలాంటిదేమీ లేకుండా ,
ఉన్నదే అపురూపమని భావించే ఈ ఆనంద హృదయాలను చూడండి .
- నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
ఎంత ప్రేమ ఉంటే మాత్రం , ఎందుకలా ఏకంగా పాదాలపై వాలిపోవడం ఏమిటని ఏమీ అనుకోనవసరం లేదు . పరిపూర్ణమైన ప్రేమికుల్లో పాదాలు తక్కువ .... చేతులు ఎక్కువ లనే భావన ఏదీ ఉండదు .అందుకే నీ పాదపుష్పాల నీడయే చాలు ఇంకా ఏ పూదోటలూ అవసరం లేదు అంటోంది|
Nee Charana Kamalala song
నీ నయన కమలాల నేనున్న చాలు Iఎందుకే ఓ దేవి నందనవనాలు
ఉన్నదానితో సంతృప్తి పడితే , అభివృద్ధి , పురోభివృద్ధి ఏముంటుంది ? అంటూ కొందరు వాదిస్తారు . నిజమే కానీ , శక్తికి మించి ,ఆశపడి ,విఫలమై , విలపిస్తూ కూర్చుంటే అదేమంత గొప్ప ? ఏదైనా నీ పరిమితులకు లోబడే ఆశించాలి. అప్పటిదాకా లభించినవి కూడా తమ పరిమితులకు లోబడే లబించాయని గ్రహించాలి . ఆ భావనలో నిజంగా ఎంత హాయి !
- నును మోవి చివురుపై నను మురళిగా మలచి
పలికించరా మధువు లొలికించరా
ఎక్కడెక్కడికో వెళ్లి పుట్టతేనియలు తేవాల్సిన అవసరం లేదు .నన్నే ఒక వేణువుగా మలిచి మధుర రాగాలు పలికించు, నీ ప్రేమలో మత్తిళ్ల చేసే మధువులు ఒలికించు అంటోంది ఆ ప్రేయసి .శరీరం గతితప్పిన వారి అరచేతిలో తేనె పోసినా కాస్తంత చప్పరించి అబ్బే చేదని ఆవల పారబోస్తారు . శరీరం సద్గతితో ఉండి ,మనసు శృతిలో ఉన్నవారికి మమతానురాగాలతో ఏమొచ్చినా అది తేనె పాత్రలాగే అనిపిస్తుంది . ఏ నాదమైనా రాగమయంగానే వినిపిస్తుంది . అందుకే ఆమె తనను ఒక వేణువుగా మలిచి నాదాలు పలికించమంటోంది .
sri krishnavataram film songs
మోవిపై కనరాని , మురళిలో వినలేనిరాగాలు పలికింతునే మధురానురాగాలు చిలికింతునే
విశేషం ఏమిటంటే , ఆమె మాట విన్న అవతలి వ్యక్తి , ఆమె ఆశించిన దానికన్నా మిన్నగా ఇంకా ఎంతో ఎత్తున నిలబడి, ఆమె కోరికల్ని తీర్చే ప్రయత్నంలో పడ్డాడు . అందరిలా కాకుండా , ఇంకెవరికో తెలియకుండా , కనిపించకుండా తాను ఆశించింది నెరవేరుస్తానంటున్నాడు . ముఖం పైన కనిపించని అనురాగాల్ని , ఏ వాయిద్యమూపలికించలేని కనీవినీ ఎరుగని కమ్మకమ్మని రాగాల్ని పలికిస్తానంటున్నాడు . పైగా పాత పోకడల్ని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండాలనుకోవడం , ఉండడం నిజంగా ఎంత ఆనందకరం ? అదీకాక , మరొకరి కంట పడకుండా , చెవిన పడకుండా అనురాగాల్ని ఒలికించడం , రాగాలు పలికించడం ఎంత గొప్ప కళ ?- నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓదేవి బృందావనాలు
విహార యాత్రగా పచ్చపచ్చని ఏ అరణ్యాల్లోనో తిరగాల్సిన అవసరం లేదు . నీ ప్రేమవనంలో నేనుంటే చాలు అని ఆమె అంటే , అనంతమైన ఆకాశయానాలు ఏమీ అవసరం లేదు. నీ హృదయమే ఒక మహా ఆకాశం . అందులో నేనుంటే చాలు అని అతడంటున్నాడు . ప్రేమికుల జీవితాల్లో వేరే అరణ్యాలు .... వేరే ఆకాశాలు ఏముంటాయి ? ఉన్నా వాటితో పనేముంటుంది ?
- తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా స్వామి - పులకింతునా
ఎవరినైనా , ఆరాధించడానికి , పూజించడానికి , బంగారు పళ్లెంలో వజ్ర వైడూర్యాలు నింపుకోవాల్సిన అవసరం ఏముంది ? ప్రేమ కూడా భక్తి లాంటిదే కదా ! ప్రేమ భక్తులకు కూడా సమర్పించుకోవడానికి నాలుగు తులసి ఆకులైనా చాలు . పూజించడానికీ , భక్తి పారవశ్యంలో పులకించడానికి అవి సరిపోతాయి . అయినా అలా పూజించనా స్వామీ అంటూ , ఒక మీమాంసను అతని ముందు పెడుతోంది . అందుకు అతనేమంటున్నాడు !
NTR songs
పూజలను గ్రహియించి- పులకింతలందించి
లోలోన రవళింతునే ఓ దేవి నీలోన నివసింతునే
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వారికి ఆడంబరాలు ఆర్భాటాల అవసరం ఏమీ ఉండదు . వాటిని వారు కోరుకోరు కూడా! పైగా , ఆ తరహా సాదాసీదా ఆరాధనలకే వారు ఆనంద పరవశులవుతారు . ఇంకా బయటెక్కడో ఎందుకులే అనుకుని ఆమె హృదయంలోనే మకాం వేసి , అనురాగ గీతాల్ని ఆలపిస్తారు . ఆ గానం వాళ్ల హృదయాల్నీ , జీవితాల్ని ధన్యం చేస్తుంది .
---బమ్మెర
చల్లని వెన్నెలలో పాట లిరిక్స్ విశ్లేషణ
లిరిక్స్ విశ్లేషణ
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు
7989892507
#నీ చరణ కమలాల నీడయే చాలు పాట, #శ్రీకృష్ణావతారం సినిమా, #Telugu old songs, #Nee Charana Kamalala సాంగ్ ,#ntr songs,#ghantasala సాంగ్స్,#susheela సాంగ్స్
నీ చరణ కమలాల నీడయే చాలు !
జీవితంలో ఇప్పటిదాకా తనకేమీ లభించనేలేదు .ఏవైనా లభ్యమైనా అవి ఎందుకూ కొరగానివని కొందరు అనుకుంటారు . మరికొందరేమో , ఇప్పుడున్నవే చాలా ఎక్కువ . ఇవి లభించడం నిజంగా ఎంతో గొప్ప అదృష్టం అనుకుంటారు . రెండవ కోవకు చెందిన వారు నిరంతరం ఆనంద డోలికల్లో తేలాడుతుంటే , మొదటి కోవకు చెందిన
వారేమో జీవితమంతా ఏడుస్తూ గడిపేస్తారు . రుషులు , మహర్షులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ , ఉన్నదాని పై నిర్లక్ష్యం , లేనిదానిపై వ్యామోహం ... ఇవే దుఃఖానికి అసలు మూలమని చెబుతుంటారు . అలాంటిదేమీ లేకుండా ,
ఉన్నదే అపురూపమని భావించే ఈ ఆనంద హృదయాలను చూడండి .
- నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
ఎంత ప్రేమ ఉంటే మాత్రం , ఎందుకలా ఏకంగా పాదాలపై వాలిపోవడం ఏమిటని ఏమీ అనుకోనవసరం లేదు . పరిపూర్ణమైన ప్రేమికుల్లో పాదాలు తక్కువ .... చేతులు ఎక్కువ లనే భావన ఏదీ ఉండదు .అందుకే నీ పాదపుష్పాల నీడయే చాలు ఇంకా ఏ పూదోటలూ అవసరం లేదు అంటోంది|
Nee Charana Kamalala song |
నీ నయన కమలాల నేనున్న చాలు I
ఉన్నదానితో సంతృప్తి పడితే , అభివృద్ధి , పురోభివృద్ధి ఏముంటుంది ? అంటూ కొందరు వాదిస్తారు . నిజమే కానీ , శక్తికి మించి ,ఆశపడి ,విఫలమై , విలపిస్తూ కూర్చుంటే అదేమంత గొప్ప ? ఏదైనా నీ పరిమితులకు లోబడే ఆశించాలి. అప్పటిదాకా లభించినవి కూడా తమ పరిమితులకు లోబడే లబించాయని గ్రహించాలి . ఆ భావనలో నిజంగా ఎంత హాయి !
- నును మోవి చివురుపై నను మురళిగా మలచి
పలికించరా మధువు లొలికించరా
ఎక్కడెక్కడికో వెళ్లి పుట్టతేనియలు తేవాల్సిన అవసరం లేదు .నన్నే ఒక వేణువుగా మలిచి మధుర రాగాలు పలికించు, నీ ప్రేమలో మత్తిళ్ల చేసే మధువులు ఒలికించు అంటోంది ఆ ప్రేయసి .శరీరం గతితప్పిన వారి అరచేతిలో తేనె పోసినా కాస్తంత చప్పరించి అబ్బే చేదని ఆవల పారబోస్తారు . శరీరం సద్గతితో ఉండి ,మనసు శృతిలో ఉన్నవారికి మమతానురాగాలతో ఏమొచ్చినా అది తేనె పాత్రలాగే అనిపిస్తుంది . ఏ నాదమైనా రాగమయంగానే వినిపిస్తుంది . అందుకే ఆమె తనను ఒక వేణువుగా మలిచి నాదాలు పలికించమంటోంది .
sri krishnavataram film songs |
విశేషం ఏమిటంటే , ఆమె మాట విన్న అవతలి వ్యక్తి , ఆమె ఆశించిన దానికన్నా మిన్నగా ఇంకా ఎంతో ఎత్తున నిలబడి, ఆమె కోరికల్ని తీర్చే ప్రయత్నంలో పడ్డాడు . అందరిలా కాకుండా , ఇంకెవరికో తెలియకుండా , కనిపించకుండా తాను ఆశించింది నెరవేరుస్తానంటున్నాడు . ముఖం పైన కనిపించని అనురాగాల్ని , ఏ వాయిద్యమూ
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓదేవి బృందావనాలు
విహార యాత్రగా పచ్చపచ్చని ఏ అరణ్యాల్లోనో తిరగాల్సిన అవసరం లేదు . నీ ప్రేమవనంలో నేనుంటే చాలు అని ఆమె అంటే , అనంతమైన ఆకాశయానాలు ఏమీ అవసరం లేదు. నీ హృదయమే ఒక మహా ఆకాశం . అందులో నేనుంటే చాలు అని అతడంటున్నాడు . ప్రేమికుల జీవితాల్లో వేరే అరణ్యాలు .... వేరే ఆకాశాలు ఏముంటాయి ? ఉన్నా వాటితో పనేముంటుంది ?
- తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా స్వామి - పులకింతునా
ఎవరినైనా , ఆరాధించడానికి , పూజించడానికి , బంగారు పళ్లెంలో వజ్ర వైడూర్యాలు నింపుకోవాల్సిన అవసరం ఏముంది ? ప్రేమ కూడా భక్తి లాంటిదే కదా ! ప్రేమ భక్తులకు కూడా సమర్పించుకోవడానికి నాలుగు తులసి ఆకులైనా చాలు . పూజించడానికీ , భక్తి పారవశ్యంలో పులకించడానికి అవి సరిపోతాయి . అయినా అలా పూజించనా స్వామీ అంటూ , ఒక మీమాంసను అతని ముందు పెడుతోంది . అందుకు అతనేమంటున్నాడు !
NTR songs |
లోలోన రవళింతునే ఓ దేవి నీలోన నివసింతునే
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వారికి ఆడంబరాలు ఆర్భాటాల అవసరం ఏమీ ఉండదు . వాటిని వారు కోరుకోరు కూడా! పైగా , ఆ తరహా సాదాసీదా ఆరాధనలకే వారు ఆనంద పరవశులవుతారు . ఇంకా బయటెక్కడో ఎందుకులే అనుకుని ఆమె హృదయంలోనే మకాం వేసి , అనురాగ గీతాల్ని ఆలపిస్తారు . ఆ గానం వాళ్ల హృదయాల్నీ , జీవితాల్ని ధన్యం చేస్తుంది .
---బమ్మెర
చల్లని వెన్నెలలో పాట లిరిక్స్ విశ్లేషణ
లిరిక్స్ విశ్లేషణ
ఇట్లు
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు
7989892507
#నీ చరణ కమలాల నీడయే చాలు పాట, #శ్రీకృష్ణావతారం సినిమా, #Telugu old songs, #Nee Charana Kamalala సాంగ్ ,#ntr songs,#ghantasala సాంగ్స్,#susheela సాంగ్స్
మీ హృదయనేస్తం
తెలుగు పాత పాటలు
7989892507
#నీ చరణ కమలాల నీడయే చాలు పాట, #శ్రీకృష్ణావతారం సినిమా, #Telugu old songs, #Nee Charana Kamalala సాంగ్ ,#ntr songs,#ghantasala సాంగ్స్,#susheela సాంగ్స్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి