పాటలో ఏముంది?
నాలుగు కళ్లు రెండైనాయి
ఏమీ లేనిదానినయ్యాను // నాలుగు కళ్లు //
రెండూ లేక పండురేకులై - ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి // నాలుగు కళ్లు //
ధారగా ప్రవహించడమే గానీ, కనీళ్లెప్పుడూ గడ్డ కట్టుకుపోవు. అదే జరిగితే ఆ తర్వాత ఆ కళ్లకింక కలలూ ఉండవు.. కన్నీళ్లూ ఉండవు. అలాగని, అందరి పరిస్థితి అంత తీవ్రంగా ఏమీ ఉండదు. కాకపోతే, చాలా మంది జీవితాల్లో ఈ కలలూ, కన్నీళ్లూ కలగలిసే ఉంటాయి. ఆ వచ్చేవి ఒకవేళ కమ్మకమ్మని కలలే అయితే, వాటితో కలిసి మనసు కలహంస నాట్యాలే చేస్తుంది. కానీ, మనిషికి వచ్చే మొత్తం కలల్లో కమ్మని కలలు ఏపాటి? అవి నాలుగో వంతైనా ఉండవు. కొందరిలో ఆ నాలుగోవంతు ఉన్నాయే అనుకున్నా, మిగతా మూడు భాగాలూ గాధామయాలే... విషాధ గాధామయాలే మరి! ఆ మాటకొస్తే, ఆనందగాధల కన్నా విషాద గాధలే లోతైనవి, విశాలమైనవి కూడా. కాకపోతే ఒక్కోసారి అవి మోయలేనంత బరువెక్కిపోతాయి. భారమవుతాయి. శక్తిని మించిన భారాన్ని మోసే వేళ చెమటలు పట్టి తనువంతా తడారిపోయినట్లు, ఈ శోకభారం మరీ ఎక్కువైనప్పుడు కూడా మనిషిలోని కన్నీళ్లన్నీ ఇంకిపోతాయి. కళ్లు బీటలు బారిపోతాయి.
నిలువుగ నన్నే దోచుకుంటివి - నిరుపేదగ నే మిగిలిపోతిని
నిరుపేదగ నే మిగిలిపోతిని // నాలుగు కళ్లు //
సుఖాంతమే అయినా, దుఃఖాంతమే అయినా, ఏదైనా ఒక కథగా మారాలటే దాని మూలాంశమేదో బలంగానే ఉండాలి! ఆ జీవితమేదో నీదే కాబట్టి ఆ మూలాంశం బలంగా ఉందో లేదో ఇతరులకన్నా నీకే బాగా తెలుస్తుంది. అంతరంగం విషయానికే వస్తే, నీ ఇష్టం లేనిదే, నీ ఆమోదం లేనిదే ఎవరో వచ్చి నీ హృదయాన్ని తీసుకుపోలేరు కదా! హృదయం దోపిడికి గురయ్యేదేమీ కాదు. కాకపోతే, హృదయాలు ఇచ్చిపుచ్చుకున్న నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోయి ఉండవచ్చు. అవతలి వ్యక్తి తీరుతెన్నులు అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా మారిపోయి ఉండవచ్చు. అలా మారిపోవడానికి ఒక్కోసారి తన అధీనంలో లేని, తాను నియంత్రించలేని ఏ బలమైన కారణాలో ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి పట్ల కొండంత సానుభూతితో అండగా నిలబడే వాళ్లు కావాలి. సానుభూతి అంటే అదేదో జాలితో జారిపడే పదార్థమేమీ కాదు. నిజమైన సానుభూతి నిఖార్సయిన ప్రేమలోంచి పుడుతుంది. అవసరమైతే ప్రాణానికి తన ప్రాణాన్ని ఫణంగా పెడుతుంది. సానుభూతి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకే లా చూడటానికి, సమస్యను సంయుక్తంగా ఎదుర్కోవడానికి, సమిష్టిగా విజయాన్ని సాధించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. వాస్తవం ఏమిటంటే సానుభూతి కరువైపోవడం ఈనాటి అతి పెద్ద సామాజిక సమస్య!! హృదయాల్లో దీన్ని ప్రతి ఒక్కరూ సాగుచేయాలి. అద్భుతంగా పండించాలి!!
- బమ్మెర
నాలుగు కళ్ళు రెండైనాయి.
రిప్లయితొలగించండిరెండు మనసులు ఒకటైనాయి.
నిలువున నన్ను దోచుకుంటివి..
ఇలాంటి సాహిత్యం ఇప్పుడు ఎవరైనా రాయగలరా...ఓ స్త్రీ ఆవేదనలో తన ప్రియుడి మూలంగా తాను ఏ విధంగా వేదన అనుభవిస్తూ వుందో...భావ గర్భితంగా తాను ఏం పోగొట్టుకుందో ఎక్కడా అసభ్యతకు ఆస్కారం లేకుండా.....❤️👍👌👍💞
చాలా చక్కటి అర్థముతో పాట రాశారు, పాట పాడిన సుశీల గారికి అభినందనలు, మీ మిత్రుడు వీ ప్రతాప్ కుమార్ హైదరబాద్.
రిప్లయితొలగించండిNice
రిప్లయితొలగించండి