పద్యం
కాలం ... విన్యాసాల విహారి !!
పరుల ఆదరమున బతుకవలసె
కొండలైనను పిండిగొట్టెడు భీముండు
ఆర్తుడై చేసాచి అడుగవలసె
అరిభయంకర ధనుర్ధరుడైన పార్థుడు
పరువును విడి జోలె పట్టవలసె
కలికి వెన్నెల సోక కందిపోవు కవలు
ఎండలో బిచ్చము నెత్తవలసె
తిరిపెపుం బువ్వ నాకలి దీర్చుకొనుచు
బరుల పంచను కాపుర ముండవలసె
బ్రాహ్మణాకృతి పాండు భూపాలసుతులు
కటకటా ఎంత చిత్రమీ కాలమహిమ
ఆకాశం అనంతమైనదైతే , కాలమూ అనంతమైనదే ! సకల చరాచర జగత్తంతా కాలగర్భంలోంచి వచ్చిందే , కడకు కాల గర్భంలో కలిసిపోయేదే ! ఎల్లలు తెలిసే సముద్రగర్భంలోనే ఎన్నెన్నో పరిణామాలు , ఆ ఎల్లలే లేని కాలంలో ఎన్నెన్ని పరిణామాలు ? అనంత కోటి బాహువులతో అది చేసే విన్యాసాల ముందు ఈ రెండు చేతుల మానవుడి పాట్లు ఏపాటి ? అప్పటికీ మనిషి ఎంతో పోరాటం చేస్తాడు . అప్పుడప్పుడు గెలుస్తాడు కూడా ! అలాగని అన్ని సార్లూ గెలవలేడు కదా ! ఒక్కోసారి ఒక భీషణమైన ఓటమితో అతని ఉనికికే ఊరూ పేరూ లేకుండాపోవచ్చు . అలాంటి స్థితిలో ఒక్కోసారి మారువేషాలతో , మారుపేర్లతో మనుగడ సాగించాల్సిన గతికూడా పడుతుంది . ఒక దశలో పాండవులకు ఈ స్థితే ఏర్పడింది .
నిజంగా కాలం ఎంత భీషణమైనది ! బయటికి కనిపించకపోవచ్చు గానీ , అది కోటానుకోట్ల అస్త్రాల్ని భూజానేసుకుని , నిరంతరం నీ చుట్టే తిరిగే మహాశక్తి స్వరూపిణి . అయితే , ఆ అస్త్రాల్లో కొన్ని నీకు మేలు చేసేవీ ఉండొచ్చు . నీపై దాడి చేసేవీ ఉండొచ్చు . కాకపోతే , కాలం సంధించే ఆ అస్త్రాల్లో ఏది నీకు మేలు చేస్తుందో , ఏది హాని చేస్తుందో చాలా సార్లు నువ్వు ఊహించలేవు . ఇక్కడే విషయాలు జటిలమవుతాయి . జీవితాలు సంఘర్షణాత్మకం అవుతాయి . సమస్యను ఎదుర్కోవడానికి , నీ బలాన్నీ , బలగాన్ని ఆసరా చేసుకుని నువ్వు ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తావు , వ్యూహాలు , ప్రతివ్యూహాలూ , చక్రవ్యూహాలూ వేస్తావు . నీకు నువ్వుగా నిలబడి , నీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడతావు . అయినా ఒక్కోసారి ఇవేవీ కొరగాకుండా పోవచ్చు . అందువల్ల అన్నిసార్లూ అన్నీ మన వశంలో ఉండవనేది మనిషి తెలియాల్సిన పరమసత్యం ! అలాంటి వశం తప్పిన పరిస్థితిలో అంతకు ముందున్న జీవన సౌఖ్యాలూ , సౌలభ్యాలన్నీ పోయి , అప్పటిదాకా కొనసాగిన వైభవమంతా మాయమైపోవచ్చు . పలితంగా , ఒక్కోసారి ధీనాతి ధీనంగా , అత్యంత దయనీయంగా కూడా బ్రతుకు ఈడ్వవలసి రావొచ్చు !
అన్నీ బావున్నప్పుడు ఎంతో మంది నిరాశ్రయులకు నువ్వు ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చు . ఇలా అంతా తలకిందులై పోయాక ఆశ్రయం కోసం నువ్వే ఇతరులను అర్థించవలసి రావచ్చు . ఒకప్పుడు ఎంతోమందికి అన్నపానీయాలు అందించిన నువ్వే పట్టెడన్నం కోసం పొట్ట చేతపట్టుకుని బిక్షాటన చేయవలసి రావచ్చు . దీన్నే కాలమహిమ అన్నారు పెద్దలు . ఆ మాటకొస్తే , మానవ జీవితం మాత్రం ఏం తక్కువ ? అదీ మహిమాన్వితమే ! కాకపోతే , కాలమహిమ ముందు కొన్నిసార్లు మానవ మహిమ నిలువలేదు . అందువల్ల పరాభవం పాలైన వాళ్లంతా అశక్తులు , అసమర్ధులు , వ్యర్థులు అనుకోవాల్సిన అవసరం లేదు . శిఖరాన్ని చేరుకున్న వారి గురించి గొప్పగా మాట్లాడినా , మాట్లాడకపోయినా వచ్చే పెద్ద నష్టమేమి లేదు గానీ , నేల గూలిన వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడటమే తగనిది . ఈ నిజాన్ని ఎవరికి వారు ఎప్పుటికప్పుడు తమ మనసుకు గుర్తు చేయడం ఎంతో శ్రేయస్కరం !! - ---బమ్మెర
That is vidhi. Kaalam. Nobody is not above these two. All are within these two. This poem is excellent. Your briefing is good. Regularly I am watching your blog. Very nice. I am eagerly waiting for your next one. Thank you Anjanna garu.🙏
రిప్లయితొలగించండిThanks
తొలగించండి9515385123
రిప్లయితొలగించండిఅభినవ బమ్మెర మీరు.
రిప్లయితొలగించండిProms interpretation is philosophical thanks Anjanna
తొలగించండిI mean peom
రిప్లయితొలగించండిInterpretation is highly philosophical
తొలగించండిమంచి విశ్లేషణ చేస్తున్న మీకు 🙏🏻🙇♀️🙏🏻🙇♀️🙏🏻
రిప్లయితొలగించండిమంచి పద్యము.ధన్యవాదములు.మేము కూడా ఐదుగురు అన్నదమ్ములము.ఉగాది శుభాకాంక్షలు 🌹🙏🌹
రిప్లయితొలగించండి