పాటలో ఏముంది .?
ఈ నల్లని రాళ్లలో ..
ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనోఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో
“ శరీరాన్ని చూసేవారికి ... మనస్సు కనిపించదు . మనస్సును చూసేవారికి ... ఆత్మ కనిపించదు " అంటూ ఉంటారు . నిజమే మరి ! ఎవరైనా , మనసు లోతులు చూడాలనుకుంటే , ఆత్మ కాంతులు చూడాలనుకుంటే , వారి దృష్టి శరీరాన్ని దాటి , మనసులోకి వెళ్లాలి . ఒక దశలో మనస్సును కూడా దాటి ఆత్మలోకి వెళ్లాలి . అప్పుడే ప్రాణవంతమైన హృదయ ప్రకంపనలు కనిపిస్తాయి . హృదయంతో మమేకమై ఉన్న రసరంజిత లోకాలు తెలుస్తాయి .. నల్లనల్లని రాళ్లల్లో దాగిన కళ్ల కాంతి పుంజాలు కనిపిస్తాయి . మనసును తాకే గుండె చప్పుళ్లు వినిపిస్తాయి .పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
మునుల వోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి || ఈ నల్లని రాళ్లలో ||
పర్వతాలెప్పుడూ ఊరి నడుమ ఉండవు . అవి అడవుల్లోనే ఉంటాయి . ఎందుకంటే ఎంతలేదన్నా , మనుషులు సంచరించే చోట ఏవో కొన్ని మానవ సంబంధమైన కక్ష్యలూ కార్పణ్యాలూ ఉంటాయి . కోపాలూ , తాపాలూ ఉంటాయి . అందుకే ఆ వాసనలు తమనెక్కడ తాకుతాయోనని పర్వతాలు మనుషులకు దూరంగా అరణ్యాల్లో వెలుస్తాయి. అరణ్యాల్లో మసలే మునీశ్వరుల్లా పర్వతాలు కూడా అరణ్యాల్లోనే బసచేస్తాయి .
కదలలేవు , మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి యలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు || ఈ నల్లని రాళ్లలో ||
నిజమే ! రాళ్లు కదలలేని , మెదలేని స్థితిలోనే ఉంటాయి . కానీ , ఒకసారి ఉలి చప్పుడు వినపడితే చాలు వాటి లోలోపలి సెలయేర్లు ఉప్పొంగడం మొదలవుతాయి . విత్తనం ఏదైతేనేమిటి ? నీటి చినుకు పడేదాకా అది చిగురించదు కదా ! చంద్ర కిరణాలు పడేదాకా కలువలు వికసించవు కదా ! పర్వతాలూ అంతే , తమ హృదయం తెలిసిన శిల్పి తమను తాకేదాకా అవి కదలవూ మెదలవు . అతడు చెంత చేరి , వాటి గుండె పైన చేయి వేసేదాకా వాటి జీవనాదాలు మొదలవ్వవు పైన కఠినమనిపించును .. లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును నిశ్చలంగా నిద్రిస్తున్న మనిషిని శవం అనుకుంటే ఎలా ? అతని నాడి పట్టుకుంటే గానీ అతని ప్రాణశక్తి తెలియదు . అతని జీవచైతన్యం తెలియదు . పర్వతాలూ అంతే , పైపైన చూస్తే , పరమ కఠినంగానే కనిపిస్తాయి . ఒకసారి వాటి గుండె తోతుల్ని తాకితే చాలు . లోలోన వెన్న ముద్దలు కనిపిస్తాయి . ఏదో మృదుత్వమే అని కాదు , ఏనాడూ ఎవరికీ హాని తలపెట్టని మానవత్వం కనిపిస్తుంది . ఆ మాటకొస్తే ,పైకి మృదువుగా కనిపిస్తూనే , లోలోన కసాయి ఆలోచనలు చేసే మనిషి కన్నా శిలలే వేయి రెట్లు మేలనిపిస్తాయి . కాదంటారా ?
--- బమ్మెర
దేశద్రోహులు సినిమా | జగమే మారినది మధురముగా ఈ వేళ పాట
మందార మకరంద మాధుర్యమున... బమ్మెర పోతన భాగవత పద్యం
పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి

Evergreen, ever melodious song..
రిప్లయితొలగించండిThanking you so much for your response.keep sharing our articles.
తొలగించండిమీ వ్యాఖ్యానం బావుంది. కళా హృదయాలను రసాప్లావితం కావిస్తుంది.
రిప్లయితొలగించండిThanking you so much,keep sharing our articles
రిప్లయితొలగించండిExcellent philosophy behind this song sir..thanks for the reflection..keep doing this good job sir..
రిప్లయితొలగించండి